Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Apr 2024 09:17 IST

1. గోరంత ఇచ్చి.. కొండంత బాదుడు

ఓ చేత్తో ఇస్తూ.. మరో చేత్తో పిండేస్తారని ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని పదేపదే జగన్‌ చెబుతుంటే.. అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తారని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సీఎం అయ్యాక పన్నులు పెంచడమే కాదు.. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపడం మొదలైంది. పూర్తి కథనం

2. ఆమె కథ విని.. కలిసేందుకు ఇంటికెళ్లి

ఓ అభిమాని కథ విన్నారు.. ఆమెను ఎలాగైనా  కలవాలని ఇంటికెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఈ నెల 2న జూబ్లీహిల్స్‌లో ది ఫ్యామిలీ స్టార్‌ బృందం మీమర్స్‌తో ఓ సమావేశాన్ని నిర్వహించింది. వారితో ఒక్కొక్కరిని పరిచయం చేసుకొని ఇంట్లో మీ ఫ్యామిలీ స్టార్‌ ఎవరంటూ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అడిగారు.పూర్తి కథనం

3. ‘అప్పు’డే అయిపోలేదు!

అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్‌ నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకూ భారీగా బకాయిలున్నాయి.పూర్తి కథనం

4. ఎండల్లో.. నో ఏసీ

గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు చేరుకోవాలంటే చాలామంది క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. తీరా క్యాబ్‌ ఎక్కాక ఏసీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిప్‌ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తే ఏసీ వేస్తామని క్యాబ్‌ డ్రైవర్లు చెబుతూ.. తమను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.పూర్తి కథనం

5. అన్నంపై పగెందుకు జగన్‌!!

అన్నదానం మహాదానం అన్న మాట వెనుక ఎంతో అర్థముంది. అదే స్ఫూర్తితో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్లు’ పేదల ఆకలి తీర్చాయి. బడుగులు ఆకలితో బాధ పడకూదనే సహృదయంతో చంద్రబాబు ఏర్పాటు చేస్తే... అధికారంలోకి వచ్చిన జగన్‌ ‘అన్న క్యాంటీన్ల’ను నిర్దయగా మూసేసి పేదలంటే ఎంత చులకనో చేతల్లోనే చూపించారు.పూర్తి కథనం

6. తాగునీటికి ఆర్థిక సంఘం నిధులు

రాష్ట్రంలో గడిచిన అక్టోబరు నుంచి వర్షాలు లేకపోవడంతోపాటు గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అవసరమైన నిధులను అధికారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. పూర్తి కథనం

7. 5 ఏళ్లు ఏం చేశావు జగన్‌

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం మోగా డీఎస్సీ విడుదల చేస్తామని దగా చేసింది. బీఈడీ, టీటీసీ, పండిత శిక్షణ, వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులకు జగన్‌మోహన్‌రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబునాయుడు ఏం చేశారని, మేము అధికారంలో కొచ్చిన వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికారు.పూర్తి కథనం

8. చేటు చేస్తున్న సిమ్‌లపై వేటు

సిమ్‌కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్‌లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పూర్తి కథనం

9. ‘వివేకం’ సినిమా చూసి ఓటేయండి: డీఎల్‌ రవీంద్రారెడ్డి

ఓటర్లు ‘వివేకం’ సినిమా చూసి ఎన్నికల్లో ఓటేయాలని వైకాపా నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. కడప వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం లేదని, ‘వివేకం’ చిత్రం చూసి ఓట్లేయాల్సిందిగా తన వద్దకు వచ్చిన వారికి సూచిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం

10. కటకటాల్లోకి నెట్టిన చిలుక జోస్యం!

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి బెడిసికొట్టి ఆవతలివారికి ముప్పుతెచ్చి పెడుతున్నాయి. అందరి భవిష్యత్తును చెప్పే చిలుక జోస్యుడు తనకు వచ్చిన ఆపదను గుర్తించ లేకపోయాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని