logo

ఆమె కథ విని.. కలిసేందుకు ఇంటికెళ్లి

ఓ అభిమాని కథ విన్నారు.. ఆమెను ఎలాగైనా  కలవాలని ఇంటికెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ.

Updated : 10 Apr 2024 04:44 IST

అభిమాని ఇంట్లో ‘ది ఫ్యామిలీ స్టార్‌‘ బృందం సందడి

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఓ అభిమాని కథ విన్నారు.. ఆమెను ఎలాగైనా  కలవాలని ఇంటికెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఈ నెల 2న జూబ్లీహిల్స్‌లో ది ఫ్యామిలీ స్టార్‌ బృందం మీమర్స్‌తో ఓ సమావేశాన్ని నిర్వహించింది. వారితో ఒక్కొక్కరిని పరిచయం చేసుకొని ఇంట్లో మీ ఫ్యామిలీ స్టార్‌ ఎవరంటూ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అడిగారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సూరారం కాలనీ సుందర్‌నగర్‌కి చెందిన ప్రశాంత్‌ తన జీవితంలో జరిగిన విషయాల్ని పంచుకున్నాడు. ‘మా ఇంట్లో ఫ్యామిలీ స్టార్‌ నా చెల్లి స్వరూప. పుట్టుకతో దివ్యాంగురాలు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. డిగ్రీ పూర్తి చేసింది. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండొద్దని ఓ కిరాణా కొట్టును ఏర్పాటు చేసుకొని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. ఇప్పుడు అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది’ అని చెప్పారు. అతని మాటలు విన్న దిల్‌రాజు భావోద్వేగానికి గురయ్యారు. తన బృందంతో త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పారు. మంగళవారం నటుడు విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరశురాంతో కలిసి వారి ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని