Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Mar 2024 13:08 IST

1. ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. పూర్తి కథనం

2. 2025 చివరి కల్లా ‘సముద్రయాన్‌’!: కిరణ్‌ రిజిజు

సముద్ర గర్భ అన్వేషణ కోసం  భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ ‘సముద్రయాన్‌’ (Samudrayaan) ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారని తెలిపారు.పూర్తి కథనం

3. ఫిట్స్‌ వచ్చి పడిపోయిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. రాయికోల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. కొల్లాపూర్‌కు వెళ్తున్న మంత్రి జూపల్లి ఆయన్ను గమనించి.. అనుచరులతో కలిసి కాపాడారు.పూర్తి కథనం

4. కారు రివర్స్‌మోడ్‌లో పెట్టడంతో కంపెనీ సీఈవో మృతి..!

కారు మోడ్‌ను పొరబాటున మార్చడంతో అమెరికాలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళా సీఈవో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని సంపన్నుల్లో ఒకరైన చావో కుటుంబానికి చెందిన ఏంజెలా (50) ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌నకు సీఈవోగా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.పూర్తి కథనం

5. యధుభూషణ్‌రెడ్డికి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

డ్వామా పీడీగా ఉన్న యధుభూషణ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన పదవీ విరమణ పొందాక వైకాపా ప్రభుత్వం పదవీకాలం పొడిగించిందని గుర్తుచేశారు. ఎన్నికల పరిశీలకులకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేసే బాధ్యతలను యధుభూషణ్ రెడ్డికి అప్పగించారని.. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందన్నారు.పూర్తి కథనం

6. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌నే గాయపరుస్తోంది: బైడెన్‌

హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంజమిన్‌ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని శనివారం వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

7. తెదేపా కార్యకర్తపై వైకాపా ఇన్‌ఛార్జ్‌ పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

వైకాపా ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అనుచరులు మచిలీపట్నంలో వీరంగం సృష్టించారు. ఉల్లిపాలెంకు చెందిన తెదేపా కార్యకర్త ఈడే యశ్వంత్‌పై వారు దాడి చేశారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పూర్తి కథనం

8. మొన్న చైనాతో సైనిక ఒప్పందం.. నేడు తుర్కియే నుంచి డ్రోన్లు..!

మాల్దీవులు (Maldives) వేగంగా భారత వ్యతిరేక కూటమిలో చేరుతోంది. ఇటీవలే చైనాతో ఓ సైనిక ఒప్పందం చేసుకొంది. దీని వివరాలను గోప్యంగా ఉంచింది. తాజాగా తరచూ భారత్‌ను విమర్శించే తుర్కియే నుంచి డ్రోన్లను కొనుగోలు చేసింది. పూర్తి కథనం

9. టెస్టు మ్యాచ్‌లకు ఇన్సెంటివ్‌ స్కీమ్‌.. బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ కామెంట్స్‌

టెస్టు క్రికెట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు.. క్రికెటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్‌లు ఆడితే అదనంగా భత్యం చెల్లించనుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడుపూర్తి కథనం

10. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గుర్తుండి పోయే క్షణాలు అవే..: రాహుల్ ద్రవిడ్

ఇంగ్లాండ్‌తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుని అదరగొట్టేసింది. ఈ సిరీస్‌లోనే నలుగురు క్రికెటర్లు భారత్‌ తరఫున అరంగేట్రం చేశారు. యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీ సాధించాడు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని