టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

అమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి..

Updated : 07 Dec 2022 22:00 IST

1. తుపాను ఎఫెక్ట్‌.. 130 వాహనాలు ఢీ

అమెరికాలోని టెక్సాస్‌లో వాహనాలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన మంచు తుపాను కారణంగా రోడ్డుపై పట్టుకోల్పోయిన 130కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటలకు  డల్లాస్‌-ఫోర్ట్‌వర్త్‌ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా వాహనాలు పట్టుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సార్‌.. మా అబ్బాయి వేలైనా ఇవ్వండి!

ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న జల ప్రళయంలో ఇప్పటివరకూ 36 మంది మృతి చెందగా.. 170 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో తమ వారి కోసం తపిస్తున్న ఆత్మీయుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నా, సహనం కోల్పోకుండా వారు వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజు నోటీసు

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఎస్‌ఈసీని కించపరిచేలా కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారని నోటీసులో పేర్కొన్నారు. ‘‘కమిషన్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయి. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలి. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలి. సాయంత్రం 5గంటల్లోగా మంత్రి కొడాలి నాని స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా సమాధానం ఇవ్వాలి’’ అని షోకాజ్‌ నోటీసులో ఎస్‌ఈసీ తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంతవరకు హెచ్‌1బి వీసాలివ్వొద్దు

అమెరికాలో శాశ్వత నివాసానికి లేదా గ్రీన్‌ కార్డుల జారీకి ఉన్న పరిమితిని తొలగించేవరకు భారత్‌లో పుట్టినవారికి హెచ్‌-1బి వర్క్‌ వీసాలు ఇవ్వొద్దంటూ.. భారతీయ-అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌’ బైడెన్‌ ప్రభుత్వానికి గురువారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితి ప్రకారం గ్రీన్‌ కార్డుల కోసం భారతీయ వృత్తి నిపుణులు.. ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన ఎందరో దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌బీఐ కొత్త గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఎంతో తెలుసా ?

5. మన భూభాగాన్ని ఎందుకు వదులుకున్నాం: రాహుల్‌

సరిహద్దులో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయనే కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు భారత్‌ భూభాగాలను వదులుకున్నారని, దానిపై ఆయన దేశప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ప్రధాని చైనాను ఎదుర్కోలేక, మన సైనికుల త్యాగాలను అవమానిస్తున్నారు. ఇప్పుడు మన బలగాలను ఫింగర్ 3 వద్ద మోహరించనున్నట్లు గుర్తించాం. ఫింగర్ 4 మన భూభాగం. ఇప్పుడు మనం ఫింగర్ 4 నుంచి వెనక్కి తగ్గి ఫింగర్ 3కి చేరాం’ అని రాహుల్ తీవ్ర స్థాయి విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కారుతో ఢీకొట్టి కార్పొరేటర్‌ హత్య

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేటర్‌ హత్య కలకలం రేపింది. కాకినాడ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్ ను అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి హతమార్చారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి  కార్పొరేటర్‌ రమేష్‌, అతని స్నేహితులు సతీష్‌, వాసులతో కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్‌ ఫోన్‌ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చైనా.. యూకే.. మీడియా యుద్ధం

చైనా.. యూకేల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్‌ లైసెన్స్‌ను బ్రిటన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు డ్రాగన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన బీబీసీ వరల్డ్ న్యూస్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. తమ కవరేజీ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా టెలివిజన్‌ అండ్‌ రేడియో రెగ్యులేటర్‌(ఎన్‌ఆర్‌టీఏ) గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఉయిగర్‌ మైనార్టీలు, కరోనా మహమ్మారి విషయంలో బీబీసీ.. దేశ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసిందని, పక్షపాతంగా వ్యవహరించిందని డ్రాగన్‌ ఆరోపించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పురపాలక, జడ్పీటీసీ ఎన్నికలకు అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాత పూర్వక అంగీకారం తెలిపింది. దీంతో త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసే అవకాశముంది. ఆగిన చోట నుంచే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగించే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాట కోసం దుస్తులు తొలగించమన్నారు

తన సినీ కెరీర్‌ గురించి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ భారీ ప్రాజెక్ట్‌లో పాట కోసం దర్శకుడు తనని దుస్తులు తొలగించమన్నారని ఆమె తెలిపారు. కోలీవుడ్‌ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె ‘అన్‌ఫినిష్డ్‌‌’ పేరుతో తన బయోగ్రఫిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాకింకా 38 ఏళ్లే.. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది

వచ్చే ఐపీఎల్‌ వేలానికి సంబంధించి గురువారం రాత్రి బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌ స్పందించాడు. తనని ఎంపిక చేయకపోవడం పట్ల బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతానని చెప్పాడు. తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌ ఆడేందుకు ఇప్పటికే 8 ఏళ్లు వేచి చూశానని.. అవసరమైతే మరిన్ని రోజులు ఎదురుచూస్తానని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని