Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Sep 2022 13:05 IST

1. 13వ రోజుకి మహాపాదయాత్ర.. గుడివాడలో తనిఖీల పేరుతో ఆంక్షలు

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కౌతవరం నుంచి రైతులు ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా సాగుతోన్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కంకిపాడు మండలం దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పాదయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివెళ్తున్న రైతులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్ల ఘటనలో మహిళల మృతికి బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో ఒక గంట వ్యవధిలోనే 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన విషయం తెలిసిందే. డీపీఎల్‌ శస్త్ర చికిత్స వికిటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మ్యాచ్‌ ఆలస్యం.. కోచ్‌ ద్రవిడ్‌పై జాఫర్‌ సెటైర్లు

నాగ్‌పుర్‌ వేదికగా భారత్‌, ఆసీస్‌ మధ్య రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను 8 ఓవర్లకు కుదించారు. అయితే ఎలాంటి వర్షం లేకపోయినా చిత్తడి కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడం పట్ల మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై సరదాగా సెటైర్లు వేశాడు. ‘కొంత వయసు వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్తే.. కొన్ని విషయాలు సమయానికి ప్రారంభం కావు’ అంటూ ద్రవిడ్‌పై జాఫర్‌ సరదా వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం.. ఇకపై తొలగించడం చాలా సులువు!

ప్రపంచ జనాభాలో మిలీనియల్స్‌, జెడ్‌ జనరేషన్‌ నుంచి ప్రస్తుత అల్ఫా జనరేషన్‌ వరకు ఎక్కువ మంది డిజిటల్‌ లైఫ్‌కు అలావాటు పడిన వారే. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికేర్‌.. ఇలా ప్రతి అవసరానికి యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ఉపయోగిస్తూనే ఉంటాం. అంతేకాదు, ఆయా సంస్థల సేవలను వినియోగించుకునేందుకు వాటిలో మన వ్యక్తిగత సమాచారం షేర్‌ చేస్తుంటాం. యూజర్‌ షేర్ చేసే వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యత పాటిస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు : బాలకృష్ణ

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయానికి డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్‌. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శాంతిని కోరుకునేవారే అయితే.. ముష్కరులకు ఆశ్రయమిస్తారా?

అంతర్జాతీయ వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్‌కు దిల్లీ దీటుగా బదులిచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని దుయ్యబట్టింది. ముంబయి పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ.. శాంతికాముకులెవరూ ఆ భీకర దాడికి కుట్రలు పన్నిన వారికి ఆశ్రయం ఇవ్వబోరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పుతిన్‌కు మోదీ సూచన.. స్పందించిన రష్యా..!

ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు. దీనిపై తాజాగా రష్యా స్పందించింది. పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని తమకు నచ్చినట్టుగా అన్వయించుకున్నాయని వ్యాఖ్యానించింది. ‘పశ్చిమ దేశాలు అసలు విషయాన్ని పక్కన పెట్టి, తమకు కావాల్సిన వాక్యాన్ని నచ్చినట్టుగా అన్వయించుకుంటాయి’ అని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ చేసి ఎనిమిది నెలలు కావొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కమల్‌ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది కాదు కానీ..

‘విక్రమ్‌’.. ఇటీవల సినీ, యాక్షన్‌ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం. కమల్‌ హాసన్‌, ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వైకాపా ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు

వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను అదే పార్టీకి చెందిన ఒక వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం గుడివాడలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం, నాడు-నేడు పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని, ప్రభుత్వ కార్యక్రమాలపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని వైకాపా ఎంపీటీసీలు, సర్పంచులు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఓటమితో ఫెదరర్‌ వీడ్కోలు.. కన్నీళ్లు పెట్టుకున్న నాదల్‌

ఫెదరర్‌ × నాదల్‌.. టెన్నిస్‌ ప్రపంచానికి అది కేవలం మ్యాచ్ కాదు ఓ సమరం. కోర్టులో అడుగుపెడితే కొదమ సింహాల్లా తలపడే వీరు.. కోర్టు బయట మాత్రం అత్యంత ప్రియమైన మిత్రులు. అందుకేనేమో.. ఒకరు ఆటను విడిచి వెళ్తోంటే మరొకరు తట్టుకోలేకపోయారు. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడ్చారు. నాదల్‌తో కలిసి కెరీర్‌ చివరి మ్యాచ్‌ ఆడిన ఫెదరర్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అది చూసిన నాదల్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని