Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Oct 2022 13:06 IST

1. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. దిల్లీలో అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించారు. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్‌ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 2023 డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలు: అంబానీ

దేశ టెలికాం రంగంలో కొత్త శకానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. దిల్లీలో శనివారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ -2022లో భాగంగా 5జీ సేవలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సహా పలువురు టెలికాం రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. ప్రపంచమంతా మాయా విలాసమని.. తన భక్తులు కానివారు మాయాధీనులు కాకతప్పదని స్వామివారు బోధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వెల్‌డన్‌ విజయ్‌.. ‘లైగర్‌’పై రష్మిక వైరల్‌ కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) చిత్రంపై నటి రష్మిక (Rashmika) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తనకెంతగానో నచ్చిందన్నారు. ‘గుడ్‌ బై’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన రష్మిక.. విజయ్‌ దేవరకొండతో తన రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా.. కానీ..: కేటీఆర్‌

 మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా కేటీఆర్‌ ప్రకటించారు. ‘‘ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విమాన ఇంధనం.. వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గాయ్‌..!

ధరల మోతతో అల్లాడిపోతోన్న దేశ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. విమాన ఇంధనం, వాణిజ్య సిలిండర్‌ ధరలు కాస్త తగ్గాయి. ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ (ఏటీఎఫ్‌) ధరను 4.5శాతం తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హోటళ్లు, రెస్టారంట్లలో ఉపయోగించే 19కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర కూడా రూ.25.5 మేర దిగొచ్చింది. ఈ తగ్గింపు అక్టోబరు 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బుమ్రా భవిష్యత్‌పై గంగూలీ ఏమన్నాడంటే..?

వెన్ను గాయం కారణంగా భారత పేస్‌ బౌలర్ బుమ్రా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ తదుపరి మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ప్రపంచ కప్‌ ముంగిట అతడు గాయపడటం టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే. నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉన్న ఈ మెగా టోర్నీకి దాదాపు అతడు దూరమైనట్లే కన్పిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాట్లాడలేకపోతున్నా.. క్షమించండి..!

ప్రధాని నరేంద్రమోదీ రాజస్థాన్‌ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్‌ తీసి పక్కన పెట్టారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా ఆయన వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం మోదీ రాజస్థాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన అనుకున్న సమయానికి కంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ క్షణాలు ఎప్పటికీ మర్చిపోను: సూర్య

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Film Awards) పొందిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు సూర్య (Suriya) అన్నారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ‘‘సురారై పోట్రు’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ క్షణం ఎంతోమందికి థ్యాంక్స్‌ చెప్పాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దసరా నవరాత్రులు.. రూ.4కోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచతన క్షేత్రంలో రూ. 4కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను ఉపయోగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని