Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
శక పురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 101వ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని.. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కొత్త పార్లమెంటు భవనం జాతికి అంకితం
అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతి (New Parliament Building)ని ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎన్టీఆర్ తెలుగువారి సత్తా దిల్లీకి చాటారు: పవన్
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
గత కొన్ని రోజుల నుంచి కీర్తి సురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె తన ఫ్రెండ్‌తో దిగిన ఫొటో వైరల్‌గా మారడంతో.. కీర్తికి కాబోయ్ వరుడు అతడేనంటూ పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ అతడు తన స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది. పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అయినా ఈ వార్తలు ఆగకపోవడంతో తాజాగా కీర్తి సురేశ్ తండ్రి సురేష్ కుమార్ (Suresh Kumar) ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గుజరాత్ vs చెన్నై ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులు నమోదయ్యేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య టైటిల్ పోరు. నేడు రాత్రి 7.30 గంటలకు అసలైన సమరం ప్రారంభం కానుంది. వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను పట్టేయాలని గుజరాత్ ఆశిస్తోంది. మరోవైపు ఐదో కప్‌ను ఖాతాలో వేసుకోవాలని చెన్నై ఆశిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ టీమ్ క్లారిటీ
హీరో శర్వానంద్ (Sharwanand) కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీమ్ తెలిపింది. ఇది చాలా స్వల్ప ఘటన అని.. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. తొలుత శర్వానంద్‌కు గాయాలైనట్లు ప్రచారం జరగడంతో ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా (USA) శ్వేతసౌధం(White House), ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు (House Republicans) సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థి ధ్రువీకరించారు. దివాలా అంచుకు చేరిన అమెరికాకు ఈ ఒప్పందంతో కాస్త ఊరట లభించినట్లైంది. శనివారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden), మెకార్థి(McCarthy) మధ్య ఫోన్‌కాల్‌లో చర్చలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో (IPL 2023) మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill). గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ స్టేజ్‌లో బెంగళూరుపై, రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై అదిరిపోయే శతకాలు సాధించాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తో (GT vs CSK) ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాలని గుజరాత్ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రేసులో అందరికంటే ముందున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
పార్లమెంట్ నూతన భవనం(new Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు సూపర్ స్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. వీరిలో బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan), సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), అక్షయ్‌కుమార్(Rajinikanth) చేసిన ట్వీట్లకు ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా స్పందించారు. నిన్న ప్రధాని మోదీ పార్లమెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. దీనిలో కేవలం నేపథ్యసంగీతం మాత్రమే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం: నటుడు రాజేంద్రప్రసాద్
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉండుంటే ఆయనకు బంగారు పూలతో పాదపూజ చేసేవాళ్లమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు