Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Dec 2022 09:12 IST

1. వ్యాపారికి ధనం.. బల్దియాకు ఇంధనం

కల్తీ నూనె కట్టడికి, అతిగా మరిగించిన నూనెతో ఇంధనం తయారీ చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నగరంలో రోజూ వేలాది లీటర్ల నూనె వాడుతుంటారు. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరిగిస్తూ.. ఆహార పదార్థాలను తయారు చేస్తుంటారు. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. దీన్ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్రెడిట్‌ కార్డుపై రుణం తీసుకుంటే...

అత్యవసరాల్లో డబ్బు అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో చాలామంది వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొందరు తమ క్రెడిట్‌ కార్డు నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా సులభంగా లభించే ఈ రుణం గురించి కొన్ని విషయాలు చూద్దామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూడు ‘ఏ’లు.. ఉన్నతికి మార్గాలు

ఒక విద్యా సంస్థ ఉన్నతంగా ఎదిగేందుకు అకడమిక్స్‌ (ఏ), అడ్మినిస్ట్రేషన్‌ (ఏ), అకౌంట్స్‌ (ఏ).. ఈ మూడు ఎంతో కీలకం. ఈ మూడింటిపై దృష్టి పెడితే ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ ఆయా 3 అంశాలపై దృష్టి పెట్టింది. ఇందుకుగాను ప్రత్యేకంగా వివిధ రంగాల నిపుణులతో ‘ఎఎఎ’ కమిటీని వర్సిటీ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: ఒక లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలివి..!

4. మా ప్రాణమా.. తిరిగిరావా!!

ఒక్కగానొక్క కూతురు విషమ పరిస్థితిని జయించి ప్రాణాలతో తిరిగొస్తుందని దాదాపు 30 గంటల పాటు నిరీక్షించిన ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలయ్యాయి!! బిడ్డతో గడిపిన క్షణాలు గుర్తొచ్చిన ప్రతి క్షణం   కన్నీళ్లు సంద్రమయ్యాయి! ఆమె జ్ఞాపకాలు కళ్లముందు మెదిలిన ప్రతిసారి... దుఃఖం కట్టలు తెంచుకుంది! ఇక లేదని..తిరిగి రాదనే విషయం జీర్ణించుకోలేక.. మనసును స్థిమితపర్చుకోలేక నరకయాతన అనుభవించారు!! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Tirumala: తిరుమల సమస్త సమాచారం కోసం యాప్‌

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ యాప్‌ ద్వారా అందించేందుకు తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేయడం మొదలు.. సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే యాప్‌ రూపకల్పన దాదాపు పూర్తయింది. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మగధీరా.. ముందుకు రారా

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మగధీరులు నానాటికీ వెనక్కిపోతున్నారు. అన్నింటిలో సగం, ఆకాశంలో సగమంటూ చెప్పుకునే మహిళలు శస్త్రచికిత్సల్లో ముందంజలో నిలుస్తున్నారు. కొన్ని రకాల అపోహలు, అనుమానాలతోనే పురుషులు ఆసక్తి కనబరచటం లేదని వైద్యులు అంటున్నారు. జిల్లాలో అత్యధిక శస్త్రచికిత్సలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో జరుగుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: అదే జరిగితే.. ఇండియాను ఇంగ్లండ్‌ మళ్లీ అడగొచ్చు: మంత్రి జగదీశ్‌

7. ఇకపై ప్రతిభ ఆధారంగా గ్రీన్‌ కార్డుల జారీ!

వాషింగ్టన్‌: దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశమిచ్చే ఈగిల్‌ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మద్దతు ప్రకటించింది. చట్టబద్ధ ఉపాధికి సమాన అవకాశాల కల్పన బిల్లును ఈగిల్‌ చట్టంగా, హెచ్‌ఆర్‌ 3648గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ఈ వారం ఓటింగ్‌ జరగనుంది. ఇది కనుక ఆమోదం పొంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Hyderabad: పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష

స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తిచేసింది. ఈమెకు తండ్రితో విభేదాలు రావడంతో 6 నెలల క్రితం నగరానికి వచ్చేసింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వలసజీవిపై గుండెపోటు

గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కుటుంబాల్లో ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. పని ఒత్తిడి, వీసా మోసాలు, వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో మృత్యు ఘటనలు పెరుగుతున్నాయి. కళ్లముందు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే తట్టుకోలేని అభాగ్యుల కుటుంబాలు వేల మైళ్ల దూరంలో నిర్జీవంగా మారిన తమ వారి గురించి తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొత్త ఎత్తులతో చిత్తు చేస్తున్నారు..

దేశం మొత్తమ్మీద సైబర్‌ నేరాలు మన రాష్ట్రంలోనే అధికంగా నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా 14,007 కేసులు నమోదుకాగా ఒక్క తెలంగాణలోనే 7,003 రిజిస్టర్‌ అయినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకి సగటున 27 కేసులు ఉంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు