Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Published : 02 Dec 2022 20:59 IST

1. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనమై పోతోంది: చంద్రబాబు

ఒక సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనమైపోతుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో నిడదవోలు పట్టణం పసుపుమయమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దివ్యాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. దివ్యాంగుల సంక్షేమంపై మరింత దృష్టిసారించేందుకు వీలుగా ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దురదృష్టం అంటే ఇదేనేమో.. కూర్చున్న చోటే మృత్యుపీఠమైంది!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం. అప్పటి వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వ్యక్తి అప్పుడే రైలెక్కాడు. గాలి చక్కగా తగులుతుందనేమో..విండో సీట్‌లో కూర్చున్నాడు. అదే అతడి పాలిట మృత్యుపీఠమైంది. రైలు వేగంగా వెళ్తుండగా.. అనుకోకుండా ఓ ఇనుప చువ్వ కిటికీ అద్దాలను పగులగొట్టుకుంటూ వ్యక్తి మెడలో చొచ్చుకుపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కివీస్‌ పర్యటనలో టాప్‌ ఆర్డర్‌ తడబడింది.. ఒకరు మాత్రం గురి తప్పలేదు: రవిశాస్త్రి

న్యూజిలాండ్‌ పర్యటన ఫలితం ఎలా ఉన్నా దీని ద్వారా టీమ్‌ఇండియాకు మంచే జరిగిందంటూ మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దీని ద్వారా యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చిందన్నాడు. ఈ సిరీస్‌ను 1-0తో కివీస్‌ జట్టు గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఉమ్రాన్‌ మాలిక్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో తమ ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వివాదాస్పదమైన ‘చేపల కూర’ కామెంట్‌.. సారీ చెప్పిన పరేశ్‌ రావల్‌!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ పరేశ్‌ రావల్‌ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చివరికి పరేశ్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గుజరాత్‌ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పరేశ్‌ రావల్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కుప్పకూలిన సున్నపురాయి గని.. ఏడుగురి మృతి.. శిథిలాల్లో మరో 15 మంది!

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జగ్దల్‌పూర్‌ జిల్లాలోని మాలేగావ్‌లో సున్నపురాయి గని కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరో 15 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గనిలో మట్టి తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా పెళ్లలు విరిగిపడటంతో బాధితులు అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హెచ్‌ఐవీ టీకా పరిశోధనలో ముందడుగు.. ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు

ఎన్నో దశాబ్దాలుగా యావత్‌ ప్రపంచానికి సవాలుగా మారిన హెచ్ఐవీ భూతాన్ని తరిమికొట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌, ఔషధాల కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మానవుల్లో జరిపిన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.  హెచ్‌ఐవీని ఎదుర్కోవడంలో కీలక ముందడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిల్లీ ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్‌ వెనుక చైనా హస్తం?

దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) సర్వర్ల హ్యాకింగ్‌ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం ఐదు ప్రధాన సర్వర్లు సైబర్‌ దాడికి గురవ్వగా.. ఇందులో ఒక సర్వర్‌ను హాంకాంగ్‌ నుంచి హ్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కుట్ర వెనుక చైనా హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అప్పట్లో నేనూ జాతి వివక్ష ఎదుర్కొన్నా.. కానీ..! : రుషి సునాక్‌

జాత్యాహంకార ఆరోపణలకు బ్రిటన్‌ రాజభవనం మరోసారి వేదికయ్యింది. ఓ నల్లజాతి సంతతికి చెందిన మహిళపై రాజభవనంలోని సీనియర్‌ సిబ్బంది జాతి వివక్ష చూపించారన్నది వివాదం. దీంతో వివాదానికి కారణమైన ప్యాలెస్‌ సిబ్బంది ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. తాజాగా వీటిపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. ఈ వివాదంపై తాను వ్యాఖ్యానించడం సరైంది కాదన్న ఆయన.. తన జీవితంలోనూ జాత్యాహంకారాన్ని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. HDFC క్రెడిట్‌కార్డుదారులకు అలర్ట్‌.. రెంట్‌ పేమెంట్‌, రివార్డు పాయింట్లపై కొత్త రూల్స్‌!

ప్రైవేటురంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లు, ఫీజు విధానంలో జనవరి 1 (Jan 1,2023) నుంచి కొత్త నియమాలను తీసుకొస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు సందేశాలు పంపుతోంది. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా చేసే రెంట్‌ పేమెంట్స్‌పై HDFC దృష్టి పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని