Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 16 Mar 2023 21:16 IST

1. Covid 19: పెరుగుతోన్న ఇన్‌ఫెక్షన్లు.. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్‌..!

కొన్ని రోజులుగా దేశంలో పలుచోట్ల కొవిడ్‌ కేసులు (Covid 19), వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల (Corona Test) సంఖ్య పెంచడంతోపాటు వ్యాక్సినేషన్‌పైనా (Vaccination) దృష్టి పెట్టాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TSPSC: ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న  జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు అనుమానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IPL 2023: బుమ్రా లేకపోయినా.. ముంబయి విజేతగా నిలుస్తుంది: సన్నీ

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లో ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీది ప్రత్యేక జర్నీ. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, గత సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబయిని తక్కువగా అంచనా వేయొద్దని క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

4. Samsung Galaxy: శాంసంగ్‌ గెలాక్సీ ‘ఏ’ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే!

తమ తాజా స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy A54 5G, Galaxy A34 5Gను శాంసంగ్‌ భారత్‌లో గురువారం విడుదల చేసింది. ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌తో ఎక్కువ కాలం ఉండేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌, అత్యాధునిక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీచర్లు వీటిలో కస్టమర్లను ఆకట్టుకునే అంశాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. GATE 2023 Results: గేట్‌ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోండి..

దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌- 2023(GATE-2023 Results) ఫలితాలు వెలువడ్డాయి. ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Rahul Gandhi: ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నాకు మాట్లాడే అవకాశం వస్తుంది

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు పార్లమెంట్‌ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి.ఆయన క్షమాపణ చెప్పాలని అధికార భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం రాహుల్ పార్లమెంట్‌కు వచ్చారు. ఈ వివాదంపై స్పందించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. రాహుల్ మాట్లాడే అవకాశం లేకుండా నిమిషాల వ్యవధిలో సభ వాయిదా పడింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Rangamarthanda: ‘రంగమార్తాండ’ను మెచ్చిన దర్శకులు.. సినిమా విడుదల ఆ రోజే

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలకానుంది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ విడుదల చేసింది. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్‌సామ్రాట్’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. South Korea: మూడుపదులు దాటినా పెళ్లికి దూరం.. రికార్డు స్థాయిలో పడిపోయిన వివాహాలు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా (Population) భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాలు మాత్రం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్‌లు సతమతమవుతుండగా.. దక్షిణ కొరియాకు (South Korea) సైతం ఇది పెను సవాలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ వివాహాల సంఖ్య గతేడాది రికార్డు స్థాయిలో పడిపోవడమే ఇందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. USA Drone: రష్యాదే తప్పు.. ఇదిగో సాక్ష్యం: అమెరికా

నల్లసముద్రం (Black sea)లో అమెరికా (USA) నిఘా డ్రోన్‌ (Drone) కూల్చివేత ఘటనపై ఇరుదేశాలూ వెనక్కి తగ్గడం లేదు. తప్పు మీదంటే మీదని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి అమెరికా తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. వేగంగా దూసుకెళ్తున్న ఫైటర్‌ జెట్‌.. ఒక్కసారిగా ఇంధనాన్ని వెళ్లగక్కుతున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా యూరోపియన్‌ కమాండ్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ChatGPT 4: చాట్‌జీపీటీలో కొత్త మార్పులు.. ఇప్పుడు మరింత క్రియేటివ్‌గా!

టెక్నాలజీ యుగంలో సంచలనంగా మారిన చాట్‌జీపీటీ (ChatGPT).. రానున్న రోజుల్లో మరింత శక్తిమంతమైన టూల్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న జీపీటీ 3 మోడల్‌తో యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నప్పటికీ మరింత కచ్చితమైన విశ్లేషణలతో సరికొత్త రూపంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు డెవలపర్‌ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని