Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 21 Mar 2023 21:18 IST

1. Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ

ఎమ్మెల్సీ కవిత ఈడీ(ED) విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 8గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. ఇవాళ్టికి కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. Sachin Tendulkar: సచిన్‌ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్‌ మాజీ పేసర్‌..కారణమేమిటంటే?

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ (Sachin Tendulkar) కాళ్ల మీద పడి మరీ క్షమించమని అడిగాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar). కానీ ఇది జరిగింది ఇప్పుడు కాదు దిగ్గజ క్రికెటర్లిద్దరూ గొప్పగా రాణిస్తున్న రోజుల్లో.. ఈ విషయాన్ని స్వయంగా భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) వెల్లడించాడు. ఇంతకీ విషయమేమిటంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్‌

ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో కాక రేపాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో భాజపా నేత పీవీఎన్‌ మాధవ్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ

ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. Newsense: ఆహాలో సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’ టీజర్‌ చూశారా?

‘ఎవడు మాట విన్నా, వినకపోయినా న్యూస్‌ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర’ అంటున్నారు నవదీప్‌ (Navdeep). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’ (Newsense). బిందు మాధవి (Bindu Madhavi) కథానాయిక, శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. TSPSC: రాజశేఖర్‌ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు

టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ కేసులో పోలీసు కస్టడీలో నాలుగో రోజు సిట్‌ అధికారులు నిందితులను విచారించారు. ఇవాళ్టి దర్యాప్తులో పలు కీలక అధారాలను సిట్‌ అధికారులు సేకరించినట్టు సమాచారం. పరీక్ష రాసిన గోపాల్‌, నీలేష్‌కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్‌ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్‌ శ్రీనివాస్‌ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘భారత్‌కు 31 వేల మంది పైలట్లు అవసరం’.. బోయింగ్‌ అంచనా!

భారత విమానయాన రంగంలో రాబోయే 20 ఏళ్లలో వేల సంఖ్యలో పైలట్లు (Pilots), సాంకేతికత సిబ్బంది (Technical Staff) అవసరం ఉంటుందని అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) అంచనా వేసింది. భారత విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు ఆర్డర్‌లు పెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. Amritpal Singh: ‘ఆపరేషన్‌ అమృత్‌పాల్‌’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!

‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌, ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh)ను కట్టడిచేయడానికి పంజాబ్‌-కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల ముందే పక్కా ప్లాన్‌ను చేశాయి. కానీ, అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన మూడు జీ-20 సమావేశాలు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో అవి ముగిసేవరకు ఓపిగ్గా వేచిచూశాయి. చివరికి శనివారం రామ్‌పూర ఫూల్‌ వద్ద అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. Nowruz: గూగుల్‌ డూడుల్‌ ‘నౌరుజ్‌ 2023’ గురించి తెలుసా?

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రజలు జనవరి 1న కొత్త ఏడాది (New Year) శుభాకాంక్షలు చెబుతూ సంబరాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కొత్త సంవత్సరాది ప్రారంభమయ్యే రోజును ఉగాది (Ugadi) పండుగగా నిర్వహిస్తారు. తెలుగువారికి ఉగాది ఉన్నట్లుగానే..  ఇరానీయన్‌ సంస్కృతిలో నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజును ‘నౌరుజ్‌’(Nowruz) అని పిలుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. Brand value: బ్రాండ్‌ విలువలో కోహ్లీని దాటేసిన రణ్‌వీర్‌.. టాప్‌-25లో అల్లు అర్జున్‌కు చోటు!

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) అత్యంత బ్రాండ్‌ విలువ (Brand value) కలిగిన సెలబ్రిటీగా అవతరించాడు. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీని (Virat Kohli) వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. 2022  సంవత్సరానికి గానూ ‘సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యేయేషన్‌ స్టడీ’ పేరిట కన్సల్టింగ్‌ సంస్థ క్రోల్‌ వెలువరించిన జాబితాలో 185.1 మిలియన్‌ డాలర్లతో రణ్‌వీర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తెలుగు నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun) సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని