Newsense: ఆహాలో సరికొత్త వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్’ టీజర్ చూశారా?
Newsense: నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ టీజర్‌ను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది.
హైదరాబాద్: ‘ఎవడు మాట విన్నా, వినకపోయినా న్యూస్ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర’ అంటున్నారు నవదీప్ (Navdeep). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్’ (Newsense). బిందు మాధవి (Bindu Madhavi) కథానాయిక, శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. ‘‘పాలిటిక్స్‌ను ఆడించే పాళి.. మదనపల్లిలో రాజకీయాల్లో కథాకళి.. పవర్‘పెన్’ పాలిటిక్స్’’ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ చూస్తుంటే, మీడియా రంగాన్ని ఉద్దేశించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Nara Lokesh: నారా లోకేశ్‌పై గుడ్డు విసిరిన ఇద్దరు నిందితులు అరెస్టు
-
Sports News
WTC Final: చెలరేగిన ట్రావిస్ హెడ్, స్మిత్.. తొలి రోజు ఆధిపత్యం ఆసీస్‌దే
-
General News
Harish rao: ఫెర్టిలిటీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి: హరీశ్‌రావు
-
Politics News
BRS: భారాసలో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు
-
General News
Bopparaju: ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు ఓపీఎస్: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Sports News
WTC Final: సిరాజ్ బౌలింగ్‌లో లబుషేన్ బొటన వేలికి గాయం