Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Mar 2024 17:13 IST

1. రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన చంద్రబాబు

రెండు నియోజకవర్గాలకు తెదేపా ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.  ప్రకాశం జిల్లా దర్శి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు బాధ్యులను నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. దర్శికి హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్‌, రైల్వే కోడూరుకు ముక్కా రూపానందరెడ్డిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను భాజపాలోకి ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపాలోకి ఆహ్వానించారు. శుక్రవారం హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి పార్టీలోకి రావాలని కోరారు. రాజ్యసభ సభ సీటు ఆశించినా.. దక్కకపోవడంతో సీతారాం నాయక్‌ భారాసపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 8వ తరగతి నుంచే.. ఉద్యమంవైపు వెళ్లాలనే ఆలోచన: మంత్రి సీతక్క

అడవి నుంచి అధికారం వరకు, ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్‌డీ వరకు ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి అక్క.. ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. అనసూయగా ప్రారంభమై.. సీతక్కగా ప్రజల మన్ననలు పొంది, ఇప్పుడు డాక్టర్ అనసూయ సీతక్కగా తెలంగాణ సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతక్క ప్రత్యేక ఇంటర్వ్యూ చూసేయండి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను పార్టీ మారడం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆయన వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేటీఆర్‌కు భద్రారెడ్డి తెలిపారు. మరోవైపు గురువారం సీఎం రేవంత్‌ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాపేరు చెప్పినా విల్లాలు కూల్చేస్తావా?.. తహసీల్దార్‌ను బెదిరించిన భారాస నేత

నగర శివారులోని నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారాస నేతపై కేసు నమోదైంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‌ పెద్దచెరువు (ఇబ్రహీంబాగ్‌ చెరువు) బఫర్‌ జోన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు కొరడా ఝులిపించాయి. చెరువు ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య గురువారం కూల్చివేతలు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘జెమిని’లో కొత్త ఫీచర్‌.. సమాధానంలో మార్పులు చేసుకునేలా!

గూగుల్‌ తమ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ జెమిని (Gemini)లో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ప్రాంప్ట్‌లకు అనుగుణంగా అది ఇచ్చే సమాధానాల్లో స్వల్ప మార్పులు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించింది. టెక్ట్స్‌లోని నిర్దిష్ట భాగాన్ని ఎంచుకొని దాన్ని మార్చడం, తొలగించడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ వెబ్‌ వెర్షన్‌, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌కు అప్పుడు అన్యాయం జరిగితే.. ప్రపంచం స్పందించలేదు: జైశంకర్‌

గ్లోబల్ సౌత్‌ (Global South)లోని భాగస్వామ్య దేశాలకు భారత్‌పై నమ్మకం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) అన్నారు. చైనా మాత్రం ఆయా దేశాల సమస్యలు వినేందుకు గతేడాది భారత్‌ ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకు రాలేదని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాళ్లకి ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత : యనమల

సొంత సోదరికే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిలదీశారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత అని అన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జీవో నంబర్ 3ని రద్దు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

ఆడబిడ్డల ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని భారాస ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఆమె దీక్ష చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని