Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Mar 2024 17:07 IST

1. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ ఒక్కటే: కేంద్రమంత్రి అమిత్‌ షా

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌.. మూడూ వారసత్వ పార్టీలే. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా’అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా: డిప్యూటీ సీఎం భట్టి

యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్‌ ఇదే.. ఏ రోజు ఏ పరీక్షో తెలుసా?

ఏపీలో 6,100 ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రకటించిన డీఎస్సీ (AP DSC) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌ టేబుల్‌ను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మంత్రి రజని రూ.6.5కోట్లు తీసుకున్నారు: వైకాపా ఇన్‌ఛార్జ్‌ మల్లెల రాజేశ్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపాలో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజని, వైకాపా అధిష్ఠానం తీరుపై రాజేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రజని తన వద్ద రూ.6.5కోట్లు తీసుకున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హరియాణా కొత్త సీఎంగా నాయబ్‌ సైనీ..

హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనను నూతన సీఎంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాక్‌తో చర్చలు.. తలుపులు మూయలేదు: జైశంకర్

పాకిస్థాన్‌తో చర్చలకు భారత్‌ తలుపులు ఎప్పుడూ మూయలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఒకవేళ ఇరు దేశాలు చర్చలు జరపాల్సి వస్తే.. ప్రధానమైన అంశం ఉగ్రవాదమని స్పష్టం చేశారు. ఇటీవల జపాన్‌, దక్షిణ కొరియా పర్యటన అనంతరం దిల్లీ చేరుకున్న ఆయన.. సోమవారం ఓ జాతీయ వార్తా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉగ్రవాదుల రక్షణకు వీటోనా..?ఇవేం ద్వంద్వ ప్రమాణాలంటూ నిలదీసిన భారత్‌..!

ఉగ్రవాదచర్యలకు పాల్పడుతున్న దుండగులను ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా అడ్డుకొనేందుకు భద్రతామండలిలోని కొన్ని శాశ్వత సభ్యదేశాలు వీటోను వినియోగించడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత  ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సీఎస్కే కెప్టెన్సీ అంశంపై ఆ జట్టు యజమాని ఏమన్నారంటే..?

ఐపీఎల్‌లో ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్‌ ఎవరు? అనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ధోనీ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎవరనే దానిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, కెప్టెన్, వైస్‌ కెప్టెన్ నియామకాల గురించి మాట్లాడొద్దని ఫ్రాంఛైజీ యాజమాని శ్రీనివాసన్ చాలా స్పష్టంగా చెప్పారని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని