YSRCP: మంత్రి రజని రూ.6.5కోట్లు తీసుకున్నారు: వైకాపా ఇన్‌ఛార్జ్‌ మల్లెల రాజేశ్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated : 12 Mar 2024 17:27 IST

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడదల రజని, వైకాపా అధిష్ఠానం తీరుపై రాజేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విడదల రజని తన వద్ద డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. 

‘‘మంత్రి రజని నా వద్ద రూ.6.5కోట్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే రూ.3కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారు. మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. మర్రి రాజశేఖర్‌కు టికెట్‌ ఇస్తే మరో రూ.20కోట్లు ఖర్చు పెట్టుకుంటా. బయటవారికి ఇస్తే ఊరుకునేది లేదు. రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలి’’ అని ఆయన సవాల్‌ విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని