Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Mar 2024 17:01 IST

1. పెట్రోల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం !

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కేరళ, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, దిల్లీ వంటి ప్రాంతాల్లో పెట్రో ధరలు అతి తక్కువగా ఉండటం గమనార్హం. స్థానికంగా సేల్స్‌ టాక్స్‌ లేదా వ్యాట్‌ (VAT) రేట్లలో వ్యత్యాసం వల్లే ధరల్లో ఈ మార్పులు చోటుచేసున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దారులన్నీ ‘ప్రజాగళం సభ’ వైపే

దారులన్నీ ‘ప్రజాగళం సభ’ వైపే అనే మాదిరిగా పల్నాడు జిల్లా బొప్పూడిలో బహిరంగ సభకు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రజలు సందడిగా సభకు చేరుకున్నారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌

భారాసకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్‌రెడ్డి భారాసకు రాజీనామా చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదు: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారాస నేత, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పీఏలు, బినామీలు అప్రూవర్‌గా మారి మద్యం కుంభకోణం కేసులో వివరాలు ఇస్తున్నారని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కాపీయింగ్‌.. పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌తో వెళ్లి..

గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్‌ వ్యవహారం ఒంగోలులో వెలుగు చూసింది. స్థానిక వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓ అభ్యర్థి మొబైల్‌ సాయంతో కాపీయింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ వారి కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకువెళ్లాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌లో పెట్టుబడులకు స్విస్‌ కంపెనీల ఆసక్తి

చాక్లెట్‌ తయారీ సంస్థ బారీ క్యాలిబాట్‌, టెక్‌ సంస్థ బుహ్లర్‌ సహా స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్‌ తెలిపారు. హెస్‌ గ్రీన్‌ మొబిలిటీ 2025 నాటికి భారత్‌లో 3,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. ఈసీ వెబ్‌సైట్‌లో కొత్త డేటా

రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. బాండ్ల పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్నికల ప్రచారం వయా సోషల్‌ మీడియా

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ (LokSabha Elections 2024)కు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. ఇందులో సామాజిక మాధ్యమాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం భాజపాకు లేదు : రాహుల్‌ గాంధీ

భాజపా ఎంతో హడావుడి చేస్తుంది కానీ, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం ఆ పార్టీకి లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబయిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..!

వాయువ్య పాకిస్థాన్‌(Pakistan)లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఉత్తర వజీరిస్థాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఏకంగా సైనిక స్థావరంపైనే ఆత్మాహుతి దాడి చేశారు. భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో పలువురు సైనికులు చనిపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని