Rahul Gandhi: రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం భాజపాకు లేదు : రాహుల్‌ గాంధీ

రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం భాజపాకు లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

Published : 17 Mar 2024 13:43 IST

ముంబయి: భాజపా ఎంతో హడావుడి చేస్తుంది కానీ, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం ఆ పార్టీకి లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబయిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు (Parliament) ఉభయ సభల్లో భాజపాకు మూడోవంతు మెజార్టీ అవసరమని ఆ పార్టీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌ ఈ విధంగా స్పందించారు.

‘సత్యం, ప్రజల మద్దతు మన వైపే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న పోరు భాజపా, కాంగ్రెస్‌ల నడుమ కాదు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ ఇది. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని వాళ్లు అనుకుంటే.. అధికార వికేంద్రీకరణ ఉండాలని మేం భావిస్తాం. రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు జ్ఞానం ఉండదని కాషాయ శ్రేణులు విశ్వసిస్తాయి. ఓ వ్యక్తి ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన, అతడు రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదు’ అని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

మణిపుర్‌ నుంచి మొదలైన భారత్‌ జోడో న్యాయ యాత్ర మార్చి 16న సాయంత్రం ముంబయిలోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్మక ఛైత్యభూమికి చేరుకోవడంతో ముగిసింది. 63 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా శివాజీ పార్కులో భారీ సభ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని