Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Apr 2024 17:01 IST

1. ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో భాగం కావాలనుకుంటున్నారా?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై 8341130393 నంబర్‌కు సలహాలను, సూచనలను పంపించాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మాయమైన పాత డేటా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా?: లోకేశ్‌

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను దహనం చేయడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా?’’ అని లోకేశ్‌ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని.. కాల్ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తుచేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్‌ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సెన్సెక్స్‌ ఖాతాలో 2 కొత్త రికార్డులు.. తొలిసారి 74,700 ఎగువన

సెన్సెక్స్‌ రెండు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇంట్రాడేలో 74,869.3 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీ.. కాస్త క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 ఎగువన ముగిసింది. అలాగే, మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీ మొత్తం విలువ సైతం తొలిసారి రూ.400 లక్షల కోట్లు దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇలాగైతే ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు? సుప్రీం ఆగ్రహం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సీనియర్ల అడుగు జాడల్లో నడిచానని చెప్పి’.. ప్రధాని మోదీపై పవార్‌ విసుర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సీనియర్ల అడుగుజాడల్లో నడిచానని గతంలో చెప్పిన మోదీ.. ఇప్పుడు భిన్నమైన వైఖరిని అవలంబిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’.. ఐదు దేశాలకు భారత్‌ సాంకేతిక సాయం

ప్రకృతి విపత్తుల సమయంలో ముందే ప్రజలను హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న ఐదు దేశాలకు భారత్‌ సాయం చేస్తోందని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మారిషస్‌లకు భారత్‌ సాంకేతిక సాయం అందిస్తోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యశ్ ఠాకూర్‌.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్‌గా అదరగొట్టి!

ప్రత్యర్థి ఎదుట లక్ష్యం 164 పరుగులు.. తొలి వికెట్‌కు అర్ధశతకం బాది ఊపు మీదున్నారు ఆ జట్టు ఓపెనర్లు.. అప్పుడొచ్చాడు ఓ యువ పేసర్.. కీలకమైన వికెట్‌ను తీసి తన జట్టుకు జోష్‌ తెచ్చాడు. ఐదు వికెట్లతో మ్యాచ్‌నే మలుపు తిప్పేశాడు.. అతడే యశ్‌ ఠాకూర్. ఇప్పుడు పేసర్‌గా మనముందున్న యశ్‌కు తొలుత ధోనీని చూసి వికెట్‌ కీపర్‌ అవుదామని ఉండేదట.. కానీ, కోచ్‌ సూచనతో పేసర్‌గా మారాల్సి వచ్చింది. ఈ కుర్రాడి గురించి ఆసక్తికర విశేషాలివీ.. 

10. సస్పెండైనా మారని మాల్దీవుల నేత.. మన జాతీయ జెండాను అగౌరవించి..

గతంలో మోదీ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెండైన మాల్దీవుల మంత్రుల్లో మరియం షియునా ఒకరు. తాజాగా ఆమె తన దేశంలోని విపక్ష మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP)ని విమర్శిస్తూ పోస్టు పెట్టారు. ఆ పార్టీ పోస్టర్‌లో మన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని ఉపయోగించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని