Maldives: సస్పెండైనా మారని మాల్దీవుల నేత.. మన జాతీయ జెండాను అగౌరవించి..

తమ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ మాల్దీవుల (Maldives) నేత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. దాంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 08 Apr 2024 14:00 IST

దిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన దగ్గరి నుంచి మన దేశం- మాల్దీవుల(Maldives) మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు నెలకొన్నాయి. సస్పెండైన జూనియర్ మంత్రి ఒకరు వీటికి ఆజ్యం పోసేలా తాజాగా చేసిన పోస్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

గతంలో మోదీ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెండైన ముగ్గురు మంత్రుల్లో మరియం షియునా ఒకరు. తాజాగా ఆమె తన దేశంలోని విపక్ష మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP)ని విమర్శిస్తూ పోస్టు పెట్టారు. ఆ పార్టీ పోస్టర్‌లో మన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని ఉపయోగించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమె ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

స్వరం మార్చిన ముయిజ్జు.. రుణవిముక్తి చేయాలని విజ్ఞప్తి

‘‘ఇటీవల నేను చేసిన పోస్టుపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. దానివల్ల ఎదురైన గందరగోళానికి చింతిస్తున్నాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎండీపీని ఉద్దేశించి పోస్టు చేసిన ఫొటో.. భారత జెండాలోని చిహ్నాన్ని పోలి ఉందని తెలిసింది. దీని వెనక ఎలాంటి దురుద్దేశం లేదు. భారత్‌తో సంబంధాలను మేము ఎంతగానో గౌరవిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉంటాను’’ అని వివరణ ఇచ్చుకున్నారు.

మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. భారత్‌ (India) తమకు ఎప్పటికీ సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని