20లోగా ఆధారాలు పంపండి:తితిదే

హంపి శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్యరం రాసింది. ఈ నెల 20లోగా హనుమాన్‌ జన్మస్థలం నిర్ధరించే ఆధారాలు పంపాలని కోరింది. హనుమంతుడి

Updated : 09 May 2021 05:56 IST

తిరుమల: హంపి శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తితిదే ప్రత్యుత్యరం రాసింది. ఈ నెల 20లోగా హనుమాన్‌ జన్మస్థలం నిర్ధరించే ఆధారాలు పంపాలని కోరింది. హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రిని తితిదే ఇటీవల ప్రకటించడాన్ని శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే.  ఈ మేరకు తితిదేకు లేఖ రాసింది. దీనిపై తితిదే అభ్యంతరం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలతోనే హనుమాన్‌ జన్మస్థలాన్ని ప్రకటించామని సమర్థించుకుంది. ఈ మేరకు ప్రత్యుత్తరంలో కమిటీ సేకరించిన వివరాలను జత చేసింది. కరోనా వ్యాప్తి తగ్గాక చర్చకు ఆహ్వానిస్తామని లేఖలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని