Venkaiah Naidu: తాత్కాలిక ప్రలోభాలకు లోనైతే.. ఐదేళ్లు ఇబ్బందే: వెంకయ్య

నీతిగా, నిజాయితీగా ఉన్నవారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.

Published : 03 Nov 2023 19:36 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆదాయాన్ని ధార్మిక పరిరక్షణకు వినియోగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు వెచ్చించాలని సూచించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్న ఆయన.. రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. నీతిగా, నిజాయతీగా ఉన్నవారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎన్నుకోవద్దని కోరారు. కులం, ధనం కాకుండా వ్యక్తి గుణానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రలోభాలకు లోనైతే ఐదేళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని వెంకయ్య హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు