మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల హతం

మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ముగ్గురు మావోలు హతమయ్యారు.

Published : 20 Jun 2022 13:41 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురి మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

‘మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లా బహేలా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. వారి ముగ్గురిపైనా రివార్డ్‌ ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది’ అని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా పేర్కొన్నారు. చనిపోయిన వారిలో డివిజినల్‌ కమిటీ సభ్యుడు నగేష్‌పైన రూ.15లక్షల రివార్డు ఉండగా.. ఏరియా కమాండర్‌ మనోజ్‌తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల క్యాష్‌ రివార్డు ఉన్నట్లు వివరించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని