మోదీ ఆందోళన చెందుతున్నారు:యడియూరప్ప

‘విస్ట్రన్‌’ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నారని గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.

Published : 18 Dec 2020 01:27 IST

ఐఫోన్ల తయారీ సంస్థ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి

బెంగళూరు:‘విస్ట్రన్‌’ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నారని గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. నాలుగు నెలలుగా యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కర్ణాటకలోని నరసాపురలో ఉన్న ఫోన్ల తయారీ కర్మాగారం విస్ట్రన్‌లో ఇటీవల ఉద్యోగులు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ..‘మేం చర్యలు తీసుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విదేశీ సంస్థ. ఇలా జరకుండా ఉండాల్సింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన  చెందుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మేం ఆదేశించాం. మేం ఆ సంస్థకు పూర్తి మద్దతు ఇస్తాం. ఎటువంటి సమస్య లేకుండా ఉత్పత్తిని కొనసాగించవచ్చు’ అని భరోసా ఇచ్చారు. 

ఇదిలా ఉండగా..ఈ ఘటనపై ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ దర్యాప్తు చేస్తోంది. విస్ట్రన్‌ కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటుందా? తెలుసుకునేందుకు ఆడిటర్లను ఘటనాస్థలికి పంపింది. యాపిల్‌కు ఈ సంస్థ అతి పెద్ద అంతర్జాతీయ సరఫరాదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సంస్థ ఐఫోన్‌7 సహా, ఇతర ఐఫోన్ల తయారీకి కావాల్సిన విడి భాగాలను ఉత్పత్తి చేస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఇది భారత్‌లో ఫోన్లను తయారు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రతిపాదించిన మేక్‌ఇన్ఇండియాకు ఈ సంస్థ కార్యకలాపాలనే విజయంగా చెప్తుంటారు. అయితే, ఇలాంటి ఘటనలు రాష్ట్రానికున్న పెట్టుడులకు అనుకూలమనే ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని, వెంటనే దర్యాప్తు చేపట్టాలని పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. 

ఇవీ చదవండి:

‘విస్ట్రన్’ ఫ్యాక్టరీ ఘర్షణ: భారీ నష్టం అంచనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని