కశ్మీర్‌ మ్యాప్‌పై వికీపీడియాకు కేంద్రం ఆదేశం

తప్పుగా చూపించిన కశ్మీర్‌ మ్యాప్‌ను తీసివేయాలంటూ భారత్‌ వికీపీడియాను ఆదేశించింది.

Published : 03 Dec 2020 12:17 IST

దిల్లీ: వికీపీడియాలో తప్పుగా చూపించిన జమ్ము కశ్మీర్‌ మ్యాప్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం 2000, సెక్షన్‌ 69ఏ ప్రకారం సంబంధిత లింకును తొలగించాలంటూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశాలు జారీ చేసింది.

భారత్‌, భూటాన్ సంబంధాలకు సంబంధించిన వికీపీడియా పేజీలో జమ్ము-కశ్మీర్‌ మ్యాప్‌ను తప్పుగా చూపినట్టు ఓ ట్విటర్‌ వినియోగదారుడు గుర్తించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఉండటంతో సదరు మ్యాప్‌ను తొలగించాలని కేంద్రం వికీపీడియాకు నవంబర్‌ 27న ఆదేశాలు జారీచేసినట్టు  సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని