ఐఏఎస్‌ల శిక్షణా కేంద్రంలో కరోనా కలకలం

ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి కేంద్ర సర్వీసులకు ఎంపికైనవారికి శిక్షణ అందించే కేంద్రంలో కరోనా కలకలం రేగింది.

Published : 22 Nov 2020 00:07 IST


ముస్సోరి: ఐఏఎస్‌ శిక్షణ కేంద్రంలో కరోనా కలకలం రేగింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉన్న లాల్‌ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో తర్ఫీదు పొందుతున్న 33మందికి వైరస్ సోకిందని శనివారం అక్కడి అధికారులు వెల్లడించారు. ‘33 పాజిటివ్ కేసులు గుర్తించాం. హాస్టళ్లు, మెస్‌, లైబ్రరీ, ఇతర కార్యాలయాలను శానిటైజ్ చేశాం’ అని అకాడమీ డైరెక్టర్‌ సంజీవ్ చోప్రా మీడియాకు వెల్లడించారు. అలాగే ఈ కేసులు వచ్చిన ప్రాంతాలను నవంబర్‌ 30 వరకు సీల్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ అకాడమీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన 428 మంది శిక్షణ పొందుతున్నారు. కాగా, వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు వైద్య బృందాన్ని పంపినట్లు డెహ్రడూన్‌ జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని