రేసులోకి మరో వ్యాక్సిన్‌!

వ్యాక్సిన్‌ తయారీ రేసులో మరో సంస్థ చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మెర్క్‌ అండ్‌ కార్పొరేషన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. అందుకోసం వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది.......

Published : 12 Sep 2020 12:20 IST

వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించిన అమెరికా సంస్థ

వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌ తయారీ రేసులో మరో సంస్థ చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మెర్క్‌ అండ్‌ కార్పొరేషన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. అందుకోసం వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. వీ591 పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ ప్రయోగం కోసం బెల్జియంలో 260 మంది వాలంటీర్లను తీసుకోనుంది. ‘మీజిల్స్‌’ వైరస్‌ను రూపాంతరం చెందించి కరోనా వైరస్‌ పుట్టించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే పద్ధతిని ఇందులో అవలంబిస్తున్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇప్పటికే పలు సంస్థలు అడ్వాన్స్‌డ్‌ స్టేజికి వెళ్లిన విషయం తెలిసిందే. మోడెర్నా, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. తాజాగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిలిచిపోయినప్పటికీ త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

‘ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌’తో కలిసి మెర్క్‌ మరో వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎబోలా వ్యాక్సిన్‌ ‘ఎర్వెబో’ అభివృద్ధికి ఉపయోగించిన పద్ధతినే దీనిలోనూ అవలంబించనున్నారు. దీని క్లినికల్‌ ట్రయల్స్‌ వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి..

24 గంటల్లో 97,570 కేసులు.. 1,201 మరణాలు

కొవిడ్‌-19కు మరో ఔషధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని