విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 12 Aug 2020 02:08 IST

 

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని మంగళవారం విడుదల చేసిన  మెడికల్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. 

కాగా, తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ వెల్లడించారు. అలాగే గత వారం రోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని