చైనా-భారత్‌ ఉద్రిక్తతల నివారణకు ఇదే మార్గం..

ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు అదే ముఖ్య కారణమని భారత్‌ స్పష్టం చేసింది.

Published : 04 Dec 2020 13:14 IST

దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోవటమే ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముఖ్య కారణమని భారత్‌ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, దౌత్య నియమాలను పాటించడమే మార్గమని భారత్‌ ప్రకటించింది.

అగ్రరాజ్యానికి చెందిన యూఎస్‌-చైనా ఎకనమిక్‌ అండ్‌ సెక్యూరిటీ రివ్యూ కమిషన్‌ వెలువరించిన తాజా వార్షిక నివేదిక.. గాల్వన్‌ లోయ ఘటన చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చోటుచేసుకుందని తెలిపింది. తూర్పు లద్దాఖ్‌లోని 17 వేల అడుగుల ఎత్తయిన గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఇరవై మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. కాగా, తమ వైపు జరిగిన ప్రాణ నష్టం గురించిన వివరాలను చైనా స్పష్టంగా వెల్లడించలేదు.

ఈ విషయమై మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ స్పందించారు. భారత్‌-చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను చక్కదిద్దేందుకు ఇరుదేశాలు 1993, 1996 ఒప్పందాలతో సహా అన్ని ఒప్పందాలను, ప్రోటోకాల్స్‌ను పాటించటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని