2-3 వారాల్లో 50ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌

రాబోయే రెండు మూడు వారాల్లో 50 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌..

Published : 15 Feb 2021 20:21 IST

దిల్లీ: రాబోయే రెండు మూడు వారాల్లో 50 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. అలాగే ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. మరో 18 నుంచి 20 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు దిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

కొవిడ్‌-19కు సంబంధించి 18 నుంచి 20 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్‌, క్లినికల్‌, అడ్వాన్స్‌డ్‌ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. సుమారు 20 నుంచి 25 దేశాలకు మనం వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నామని తెలిపారు. వ్యాక్సిన్‌కు సంబంధించి అపోహలు వీడాలని ప్రజలకు సూచించారు. అదే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. గడిచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా 188 జిల్లాల్లో ఒక్క కొవిడ్‌-19 కేసూ నమోదు కాలేదని చెప్పారు. 21 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసూ లేదని తెలిపారు. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని