NCP: అజిత్‌దే అసలైన ‘ఎన్సీపీ’.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు తిరస్కరణ

ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మహారాష్ట్ర స్పీకర్ తిరస్కరించారు.

Published : 15 Feb 2024 22:04 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) వ్యవహారంలో మరో కీలక పరిణామం. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో వైరి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్, అజిత్‌పవార్ వర్గాలు పరస్పరం దాఖలు చేసిన పిటిషన్‌లను మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించారు. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గమే అసలైన ఎన్సీపీ అని వెల్లడించారు. ఆయన వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యే (41 మంది)లు ఉన్నారని తెలిపారు. శరద్ పవార్ నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదా ఆయన ఆదేశాలను ధిక్కరించడం ఫిరాయింపు కాదని పేర్కొన్నారు.

అజిత్‌ పవార్‌ గతేడాది ఎన్సీపీ నుంచి చీలి భాజపా- శిందే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. దీంతో పార్టీ ఎవరిదనే విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు