Anand Mahindra: ఇప్పటిదాకా ఆ వ్యక్తి గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా: ఆనంద్‌ మహీంద్రా

ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరో స్ఫూర్తిదాయక కథనాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వ్యక్తి గురించి ఇప్పటిదాకా తెలుసుకోనుందుకు సిగ్గుపడుతున్నానని ట్వీట్ చేశారు.

Published : 11 Aug 2023 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజంలో జరిగే ఎన్నో ఆసక్తికర విషయాలను, స్ఫూర్తివంతమైన కథనాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. వాటితోపాటు సరికొత్త ఆవిష్కరణలు చేసేవారికి తన వంతుగా చేయూత అందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని తన ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వ్యక్తి గురించి ఇప్పటిదాకా తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నానని వీడియోను ట్వీట్‌ చేశారు. 

‘‘లోకాన్ని నువ్వు చూడకపోతేనేం.. లోకం మొత్తం నిన్ను చూసేలా ఏదైనా సాధించు. ఇప్పటిదాకా నేను విన్న వాటిలో ఇవే అత్యంత స్ఫూర్తిదాయకమైన మాటలు. ఈ వీడియో నా ఇన్‌బాక్స్‌లోకి వచ్చే వరకు భవేష్‌ గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా. కొన్ని మిలియన్‌ యూనికార్న్‌ల కన్నా అతని స్టార్టప్‌ ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది. భవేష్‌ నువ్వు ఎప్పుడూ ఎదుగుతూనే ఉండు’’ అంటూ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అణచివేత సందేశాన్ని పంపడానికే ఆకతాయిల లైంగిక హింస!

వీడియోలో భవేష్‌ భాటియా అనే వ్యాపారవేత్త గురించి రాజీవ్‌ తనేజా అనే వ్యక్తి పాడ్‌కాస్ట్‌లో చెబుతుంటాడు. మహాబలేశ్వరానికి చెందిన భవేష్‌ పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయారు. ఉపాధి కోసం రోడ్డు పక్కన కొవ్వొత్తులు అమ్మేవారు. తర్వాత తనే సొంతంగా సన్‌రైజ్‌ క్యాండిల్స్‌ అనే కొవ్వొత్తులు తయారీ పరిశ్రమను నెలకొల్పారు. క్రమంగా దాన్ని రూ. 350 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరింపజేశారు.  ప్రస్తుతం ఆయన పరిశ్రమలో తనలాగే చూపు కోల్పోయిన సుమారు 9700 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు ఈ వీడియో చూసిన నెటిజన్లు భవేష్‌ పట్టుదలను మెచ్చుకుంటూ.. స్ఫూర్తిదాయకమైన కథనాన్ని షేర్‌ చేసినందుకు మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని