ఈజిప్టులో బయటపడ్డ  ప్రాచీన బీర్‌ ఫ్యాక్టరీ 

ప్రాచీనమైన ఈజిప్టు దేశంలో గతకొంత కాలంగా పురావస్తుశాస్త్రవేత్తలు మమ్మీలు మొదలు ఎన్నో పురాతన వస్తువులను వెలికితీస్తున్నారు. ఈ మధ్య శవపేటిక నుంచి మమ్మీని బయటకు తీశారు. ఇటీవల జరిపిన తొవ్వకాల్లో ఓ అస్థిపంజరానికి బంగారు నాలుక కనిపించింది. తాజాగా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే

Updated : 16 Feb 2021 09:48 IST

కైరో: ఈజిప్టులో గతకొంత కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో వస్తువులను వెలికితీస్తున్నారు. ఈ మధ్య శవపేటిక నుంచి మమ్మీని బయటకు తీశారు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఓ అస్థిపంజరానికి బంగారు నాలుక కనిపించింది. తాజాగా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్‌ ఫ్యాక్టరీని గుర్తించారు. కైరో నగరానికి దక్షిణవైపున 450కి.మీ దూరంలో, నైల్‌ నదికి పశ్చిమాన ఉన్న ఏడారిలో అబిడోస్‌ అనే శ్మాశన ప్రాంతంలో ఈ బీర్‌ ఫ్యాక్టరీ బయటపడింది. ఇందులో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌ 20 మీటర్ల పొడవు.. 2.5 మీటర్ల వెడల్పు ఉన్నాయి. యూనిట్‌లో దాదాపు 40 కుండలు ఉన్నాయి. వీటిలోనే బీర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలను వేసి వేడిచేసేవారట. కింగ్‌ నార్మన్‌ అనే చక్రవర్తి హయాంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తుశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం 3,150 - 2,613 మధ్య తొలి ఐక్య ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా కింగ్‌ నార్మన్‌కు పేరుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని