Baby MufflerMan: ‘బేబీ మఫ్లర్‌మెన్‌‌’ మళ్లీ వచ్చేశాడు.. ఈసారి ఎందుకంటే?

‘బేబీ మఫ్లర్‌మెన్‌’.. ఈపేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. అదే బుల్లి అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అవును మరి..  2020 ఫ్రిబవరి 16న దిల్లీకి మూడోసారి సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఈ చిన్నారి హడావుడి అంతా ఇంతా కాదు.

Updated : 25 Nov 2022 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బేబీ మఫ్లర్‌మెన్‌’.. ఈపేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. అదే బుల్లి అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అవును మరి..  2020 ఫ్రిబవరి 16న దిల్లీకి మూడోసారి సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఈ చిన్నారి హడావుడి అంతా ఇంతా కాదు. ఓ పక్క స్టేజీ మీద సీనియర్‌ కేజ్రీవాల్ గురించి ఎంత చర్చ నడుస్తుందో..  స్టేజీకి అల్లంత దూరంలో ఉన్న ఈ బుడతడికి అంతే క్రేజ్‌ వచ్చింది. ఆప్‌ ఎన్నికల ప్రచారంలో మఫ్లర్‌ కట్టుకొని ఏవిధంగా అరవింద్‌ కేజ్రీవాల్‌  కనిపించారో.. అదే రీతిలో దర్శనమిచ్చాడు అవ్యాన్‌. కేజ్రీవాల్‌ వాకింగ్‌ స్టైల్‌తో అందరి చూపుని తనవైపు తిప్పుకున్నాడు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు.  సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ కావడంతో లిటిల్‌ మఫ్లర్‌మెన్‌, బేబీ కేజ్రీవాల్‌ అంటూ పేర్లు కూడా వచ్చేశాయి. కట్‌ చేస్తే.. ఈ బుడతడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

తాజాగా పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ భగవంత్‌ మాన్‌ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బేబీమఫ్లవర్‌ మెన్‌ కాస్త.. బేబీ భగవంత్‌ మాన్‌ లుక్‌లో కనిపించాడు. వెనుక ఎంపీ భగవన్‌ మాన్‌  ఫొటో ఉండగా.. విక్టరీ గుర్తులతో మెడకి మఫ్లర్‌ తలకి పసుపురంగు తలపాగా చుట్టుకొని ఫొటోల్లో దర్శనమిచ్చాడు. మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. ‘‘ మా బేబీమఫ్లర్‌మెన్‌ ఇప్పుడు పంజాబ్‌ సీఎం భగవన్‌మెన్‌గా సిద్ధమయ్యాడు’’ అంటూ ట్వీట్‌ చేసింది.

ఇక ప్రమాణస్వీకారం రోజు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ బుడతడికి ఆ కార్యక్రమం అనంతరం ఆప్‌ పార్టీ నుంచి పిలుపువచ్చింది. ఆ చిన్నారిని ఎత్తుకొని..  వాళ్ల కుటుంబసభ్యులతో అరవింద్‌ కేజ్రీవాల్‌ కొంత సమయం గడపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని