మూడు ఫంగస్‌లతో పాజిటివ్‌ వ్యక్తి మృతి

కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.  స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన

Updated : 29 May 2021 18:20 IST

లఖ్‌నవూ: కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.  స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. 

కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల  వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి మెదడు సమీపంలో ఈ ఫంగస్‌ ఉందని, ఇప్పటికే ఆయన దవడలో సగభాగం తీసేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు చెప్పారు.

ఇటీవల కరోనా బాధితుల్లో ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12వేల పైచిలుకు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. అక్కడక్కడా వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని