Mumbai-Goa cruise ship: నౌకలో కరోనా కల్లోలం.. 66మందికి పాజిటివ్‌

ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం రేగింది. నౌకలోని ఓ సిబ్బంది ఒకరికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దాదాపు 2వేల మందికి

Published : 03 Jan 2022 18:19 IST

పనాజీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ కార్డెలియా క్రూజ్‌ నౌకలో కల్లోలం సృష్టిస్తోంది. దాదాపు 2000 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఈ భారీ నౌకలో 66 మందిలో ఈ వైరస్‌ వెలుగుచూసినట్టు గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె వెల్లడించారు. ఈ సమాచారాన్ని సంబంధిత కలెక్టర్లకు, ముంబయి పోర్టు ట్రస్ట్‌కు ఇచ్చామనీ.. ప్రయాణికులు నౌక నుంచి బయటకు వచ్చే విషయంలో అధికారులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

నిన్న ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పీపీఈ కిట్లు ధరించి వైద్య బృందాలు అక్కడికి చేరుకొని ప్రయాణికులు, సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితాలు వచ్చేదాక ఎవరూ నౌక దిగి వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.  తొలుత ఓ వ్యక్తికి కొవిడ్‌ సోకినట్టు తేలగానే గోవా తీరంలో ఈ భారీ నౌకను నిలిపేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో మోర్ముగావ్‌ తీర ప్రాంతంలో నిలిపారు. కరోనా కల్లోలంతో ప్రయాణికులంతా నిన్నటి నుంచి నౌకలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని