Haridwar: ఆ ఆలయాలకు పొట్టి దుస్తులతో వస్తే కఠిన చర్యలు: మహానిర్వాణి అఖారా

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ‘మహానిర్వాణి అఖారా’ పరిధిలో ఉన్న మూడు ఆలయాల్లో డ్రెస్‌ కోడ్‌ (dress code)ను ప్రవేశపెట్టారు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహానిర్వాణి అఖారా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Published : 09 Jun 2023 21:19 IST


(Image Credit: Google map)

హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ‘మహానిర్వాణి అఖారా’ హిందు ధర్మ సంస్థ.. తమ పరిధిలో ఉన్న ఆలయాల్లో (temple)కి మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని నిబంధన విధించింది. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శరీరాన్ని 80 శాతం కప్పి ఉంచే సంప్రదాయ దుస్తులతో వస్తేనే దైవ దర్శనానికి అనుమతిస్తామని ‘మహానిర్వాణి అఖారా’ సెక్రెటరీ శ్రీమహంత్‌ రవీంద్ర పూరి తెలిపారు. 

హరిద్వార్‌ (haridwar)లోని కంఖాల్‌లో ఉన్న దక్ష ప్రజాపతి ఆలయం, పవూరి జిల్లాలోఉన్న నీలకంఠ మహాదేవ్‌ ఆలయం, దెహ్రాదూన్‌లోని టపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం ‘మహానిర్వాణి అఖారా’ పరిధిలో ఉన్నాయి. ఈ మూడు దేవాలయాల్లోకి మహిళలు షార్ట్స్‌, ఫ్యాషన్‌ దుస్తులు ధరించి రావొద్దని రవీంద్ర పూరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశామని.. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దక్షిణ భారత్‌, మహారాష్ట్రలోని పలు ఆలయాల్లో ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని.. ఇప్పుడు ఈ ఆలయాల్లోనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని