Satyendar Jain: జైన్‌కు లభించని ఊరట.. ఈడీ కస్టడీ గడువు పొడిగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట లభించలేదు.

Published : 09 Jun 2022 12:38 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును గురువారం కోర్టు పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది.

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ  దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు దానికి మరోసారి సోమవారం వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా.. సత్యేందర్‌, మరికొందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా డబ్బుతో పాటు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని