అంబులెన్స్‌లో రూ.25 కోట్లపైగా దొంగ నోట్లు.. వాటిపై ‘రివర్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా ముద్రణ!

గుజరాత్‌లోని సూరత్‌లో దొంగ నోట్ల గుట్టురట్టయ్యింది. అంబులెన్స్‌లో తరలిస్తున్న రూ.25 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నోట్లపై ‘రివర్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఉండటం గమనార్హం.

Published : 01 Oct 2022 02:29 IST

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు భారీగా దొంగనోట్లను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో తరలిస్తున్న రూ.25.80 కోట్ల ఫేక్‌ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వాహనాన్ని అడ్డగించి ఆరు పెట్టెల్లో, రెండు వేల రూపాయల నోట్ల కట్టలు (1,290 కట్టలు)ను సీజ్ చేశారు. అయితే, ఆ కరెన్సీపై ‘రివర్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ముద్రించి ఉండటం గమనార్హం.

ఈ అంశంపై స్థానిక ఎస్పీ హితేశ్‌ జోయ్‌సర్‌ మీడియాతో మాట్లాడారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నోట్లు ఎక్కడ అచ్చు వేశారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందం సైతం ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని