Floating Bridge: సముద్రపు అలలపై నడిచేద్దామా..

సముద్రం ఒడ్డున ఉంటే ఆ అలల శబ్ధానికి గుండె ఝల్లుమంటుంది. బీచ్‌లో దిగాలన్నా, కాస్త లోపటికి వెళ్లాలన్నా కాస్త ధైర్యం చేయాల్సిందే. అలాంటిది ఉవ్వెత్తున ఎగసిపడే అలలపై నడుచుకుంటూ వెళ్లాలంటే.. అలలపై నడుచుకుంటూ వెళ్లడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. నిజమే.. కర్ణాటకలో సముద్రం నీటిపై తేలియాడే వంతెనను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. దాని విశేషాలంటో చూద్దామా..

Published : 07 May 2022 19:20 IST

ఉడుపి: సముద్రం ఒడ్డున ఉంటే ఆ అలల శబ్ధానికి గుండె ఝల్లుమంటుంది. బీచ్‌లో దిగాలన్నా, కాస్త లోపటికి వెళ్లాలన్నా కాస్త ధైర్యం చేయాల్సిందే. అలాంటిది ఉవ్వెత్తున ఎగసిపడే అలలపై నడుచుకుంటూ వెళ్లాలంటే.. అలలపై నడుచుకుంటూ వెళ్లడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. నిజమే.. కర్ణాటకలో సముద్రం నీటిపై తేలియాడే వంతెనను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. దాని విశేషాలంటో చూద్దామా.. కర్ణాటకలోని ఉడుపి మాల్పే బీచ్‌లో వంద మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు ఉన్ననీటిపై తేలియాడే వంతెనను స్థానిక ఎమ్మెల్యే రఘుపతి ప్రారంభించారు. సముద్రంలో తేలియాడే బ్రిడ్జిని ప్రయోగాత్మకంగా కర్ణాటక ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదే తొలి తేలియాడే వంతెన అన్నారు. బ్రిడ్జి వద్ద 20 నుంచి 25 మంది సహాయకులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్‌లు వేసుకుని రావాలని సూచించారు. ఈ బ్రిడ్జి కారణంగా ఉడిపిలో పర్యాటకం మరింత పెరుగుతుందని రఘుపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వంతెన పైనుంచి సముద్రంలోకి వెళ్లి అందాలను ఆస్వాదించడానికి వీలుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం 15 రోజులపాటు ఈ తేలియాడే బ్రిడ్జిని ట్రయల్స్ కోసం అందుబాటులో ఉంచుతామని, వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని