దిల్లీ వెళ్లు.. కానీ షరతులు వర్తిస్తాయి

దిల్లీ: భీమ్‌ ఆర్మీ ఛీప్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ దిల్లీకి వెళ్లేందుకు తీస్‌ హజారీ న్యాయస్థానం అనుమతించడంతో పాటు కొన్ని షరతులను విధించింది. ఎన్నికలు, మెడికల్‌ సంబంధంగా మాత్రమే ఆజాద్‌ దిల్లీకి వచ్చేందుకు అనుమతించింది. ఆయన రాజధానికి వచ్చే ముందు డిప్యూటీ కమిషర్‌ ఆ

Published : 22 Jan 2020 01:52 IST

దిల్లీ: భీమ్‌ ఆర్మీ ఛీప్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ దిల్లీకి వెళ్లేందుకు తీస్‌ హజారీ న్యాయస్థానం అనుమతించడంతో పాటు కొన్ని షరతులను విధించింది. ఎన్నికలు,వైద్యపరంగా మాత్రమే ఆజాద్‌ దిల్లీకి వచ్చేందుకు అనుమతించింది. ఆయన రాజధానికి వచ్చే ముందు డిప్యూటీ కమిషర్‌ ఆఫ్‌ పోలీస్‌(క్రైమ్‌)కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దిల్లీకి ఎందుకు, ఎప్పుడు వస్తున్నాడనే దానికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులకు అందజేయాలి. ఎక్కడ ఉంటున్నాడనే విషయాన్ని కూడా తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

‘రాజధానిలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందులో ఆజాద్‌ కూడా ఉంటాడు’ అని న్యాయమూర్తి కమిని లూ పేర్కొన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెల 20న ఆజాద్‌ నేతృత్వంలోని భీమ్‌ ఆర్మీ జామా మసీదు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మసీదు నుంచి జంతర్‌ మంతర్‌ వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ర్యాలీకి బయల్దేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆజాద్‌ సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఇటీవల అతడిని కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ నాలుగు వారాల వరకు నగరానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని