నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్‌

జపాన్‌కు చెందిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్‌-19 సోకింది. ఈ మేరకు ఆదివారం జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు.

Published : 17 Feb 2020 01:41 IST

టోక్యో: జపాన్‌కు చెందిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్‌-19 సోకింది. ఈ మేరకు ఆదివారం జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. గత రెండు రోజుల్లో ఈ నౌకలో కొత్తగా 137 మంది వైరస్‌ బారిన పడ్డారని తెలిపారు. నౌకలో తుది పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మొదలవుతాయని చెప్పారు. వాటి అనంతరం భారతీయులను బయటికి తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా సహకారం అందించడానికి భారత రాయబార కార్యాలయం సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం నౌకలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య మొత్తం 355కి చేరుకున్నట్లు జపాన్‌ అధికారులు వెల్లడించారు. 

జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్సెన్‌ నౌక నుంచి హాంకాంగ్‌లో దిగిన వ్యక్తికి కొవిడ్‌ సోకినట్లు గుర్తించడంతో దాన్ని యొకొహామా పోర్టులో నిలిపివేశారు. ఇందులో 3700పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా ఇప్పటివరకు చైనాలో వైరస్‌ కారణంగా 1600 మందికి పైగా మృత్యువాత పడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి..
ఆ 406 మందికి కొవిడ్ సోకలేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని