ఎవరినీ వదలొద్దు: కేజ్రీవాల్‌

ఈశాన్య దిల్లీలో అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలొద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.........

Updated : 27 Feb 2020 19:00 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీలో అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలొద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ ఘటనల్లో తమ పార్టీకి చెందిన వారి జోక్యం ఉందని రుజువైతే వారిపై రెట్టింపు చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లర్లు, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఈ అల్లర్లు జరిగిన ప్రాంతంలో సర్వం కోల్పోయిన వారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఈశాన్య దిల్లీలో గత మూడు రోజులుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. 

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

అల్లర్లలో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. తీవ్రవంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. అలాగే, గాయపడిన వారికి ఆస్పత్రుల్లో అయ్యే చికిత్సకయ్యే ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనల సందర్భంగా తగలబడిన ప్రజల దస్త్రాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని