యూపీలో పోస్టర్‌ వార్‌

యూపీలో పోస్టర్ల వార్‌ నడుస్తోంది. సీఏఏ ఆందోళనల్లో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని చిత్రాలు, పేర్లతో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పోస్టర్లను ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్‌గా

Published : 13 Mar 2020 20:33 IST

లఖ్‌నవూ: యూపీలో పోస్టర్ల వార్‌ నడుస్తోంది. సీఏఏ ఆందోళనల్లో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని చిత్రాలు, పేర్లతో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పోస్టర్లను ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్‌గా ఇదే తరహాలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పోస్టర్లను ఏర్పాటు చేసింది. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న భాజపా నేతలు స్వామి చిన్మయానంద్, కులదీప్‌ సింగ్ సెంగార్‌ వివరాలతో కూడిన పోస్టర్లను లఖ్‌నవూలో ఆ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎస్పీ నేత ఐపీ సింగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించినా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పోస్టర్లను తొలగించలేదు. నిరసనకారులకు వ్యక్తిగతకు గోప్యత లేనప్పుడు, నేను కూడా కొంత మంది నేరస్థుల వివరాలతో  పోస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. దాని వల్ల మన కుమార్తెలు వారి గురించి తెలుసుకుంటారు’’ అని పేర్కొన్నారు. ‘కుమార్తెలు జాగ్రత్తగా ఉండాలి, హిందుస్థాన్‌ సురక్షితంగా ఉండాలి’ అనే నినాదంతో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనల నిందితులుగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 55 మంది ఫొటోలు, వివరాలతో పోస్టర్లను లఖ్‌నవూ వీధుల్లో ఏర్పాటు చేసింది. అయితే వీటిని తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై యోగి సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపై వచ్చే వారం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వాదనలు వింటుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని