వైద్య సిబ్బందికి సూక్ష్మక్రిమి రహిత ఛాంబర్‌ 

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది కోసం డీఆర్‌డీవో(భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ప్రత్యేక ఛాంబర్‌ను రూపొందించింది. ఈ ఛాంబర్‌ నుంచి నడిచి వెళితే హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణం 25 సెకన్లపాటు స్ర్పే అవుతోంది.

Published : 06 Apr 2020 01:32 IST


హైదరాబాద్‌: కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది కోసం డీఆర్‌డీవో(భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ప్రత్యేక ఛాంబర్‌ను రూపొందించింది. ఈ ఛాంబర్‌ నుంచి నడిచి వెళితే హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణం 25 సెకన్లపాటు స్ర్పే అవుతోంది. 700 లీటర్ల సామర్థమున్న ట్యాంకులను ఛాంబర్‌కు అనుసంధానం చేశారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, అత్యవసర ప్రాంతాల ప్రవేశ మార్గాల్లో సూక్ష్మక్రిమి రహిత ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం ధరించేందుకు ఇబ్బంది లేకుండా తక్కువ బరువుతో ప్రత్యేకమైన మాస్కునూ డీఆర్‌డీవో తయారు చేసింది. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని