5 కేజీల గ్యాస్‌ సిలిండర్లు 8

గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్‌ను ఉపయోగించే వినియోదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో ఎనిమిది సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటిచింది. దానితో పాటు 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే వారికి మూడు సిలిండర్లు......

Updated : 12 Apr 2020 21:27 IST

దిల్లీ: గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్‌ను ఉపయోగించే వినియోదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో ఎనిమిది సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే వారికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 5కేజీల సిలిండర్లు వాడే వినియోగదారుల గురించి స్పష్టత నివ్వలేదు. తాజాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. 14.2 కేజీల సిలిండర్లు వాడే వారికి మూడు, 5కేజీల సిలిండర్లు వాడే వారికి 8 చొప్పున ఇవ్వనున్నట్లు ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వెల్ఫేర్‌ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం మార్చి 26న రూ.1.7 లక్షల కోట్లు కేటాయించింది. దాని కింద వంట గ్యాస్‌ను ఉపయోగించే 8 కోట్ల మంది పేదలకు జూన్‌ వరకు మూడు సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు దీనికి అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు