మీకోసం అమెరికా ప్రార్థిస్తోంది: మెలానియా

కరోనా వైరస్‌ బారినపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తొందరగా కోలుకోవాలని అమెరికా ప్రథమ పౌరురాలు, డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఆకాంక్షించారు. గర్భవతిగా ఉన్న బోరిన్‌ జాన్సన్‌ భార్యతో ఫోన్‌లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు స్వేతసౌధం ప్రకటించింది.

Updated : 17 Apr 2020 19:02 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ బారినపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా ప్రథమ పౌరురాలు, డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఆకాంక్షించారు. బోరిన్‌ జాన్సన్‌ భార్య గర్భవతి కావడంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని దంపతులు సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఏప్రిల్ 4న తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడినప్పటికీ ప్రస్తుతం కోలుకున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ భార్య సైమండ్స్‌ ఈ మధ్యే వెల్లడించారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఆరోగ్యం కూడా ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే బ్రిటన్‌లో కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరో 3వారాలు పొడిగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని