నిలకడగా మన్మోహన్‌‌ ఆరోగ్యం

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్‌ వైద్యులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్‌ తీవ్ర అస్వస్థతకు...

Updated : 11 May 2020 15:48 IST

చికిత్సకు స్పందిస్తున్నారు: ఎయిమ్స్‌ వైద్యులు

దిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్‌ వైద్యులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేర్పించగా పలువురు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మన్మోహన్‌ కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. అలాగే ఆయనకు జ్వరం ఉందని, అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా కొనసాగిన మన్మోహన్‌ సింగ్‌ 2009లో ఇక్కడే బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని