‘అవి బడ్జెట్‌ కేటాయింపులే కదా..?’

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం ప్రకటించిన పథకాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.......

Published : 16 May 2020 14:28 IST

వ్యవసాయరంగానికి ప్రకటించిన ప్యాకేజీపై స్పష్టత కోరిన చిదంబరం

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం ప్రకటించిన పథకాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం పలు సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రకటించిన తెనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు, పశురోగ నియంత్రణ కార్యక్రమానికి రూ.13,343 కోట్లు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉన్నవే కదా అని సందేహం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం ప్రకటించిన నిధులు వాటికి అదనమా లేక బడ్జెట్‌లో భాగమేనా అన్నది స్పష్టతనివ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కోరారు. 

నిర్మలా సీతారామన్‌ శుక్రవారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం పలు పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.1,63,343 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. పంట దిగుబడుల పెంపు, వాటి నిల్వ, మార్కెటింగ్‌కు అనువైన మౌలికవసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయడంతోపాటు, చట్టపరమైన సంస్కరణలకు ఇందులో పెద్దపీట వేశారు. మొత్తం 11 అంశాలపై కీలక ప్రకటనలు చేయగా, ఇందులో 8 మౌలికవసతుల కల్పనకు సంబంధించినవే. మిగిలిన 3 చట్ట సవరణల కోసం ఉద్దేశించినవి.

ఇదీ చదవండి..

వ్యవసాయం.. సంస్కరణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని