అదే సైనికులకు నిజమైన నివాళి: ఎస్‌జేఎం

ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా చైనా సంస్థలను నిషేధించాలని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సరిహద్దులో చైనాతో ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు ఇదే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించింది........

Published : 17 Jun 2020 09:36 IST

దిల్లీ: ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా చైనా సంస్థలను నిషేధించాలని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సరిహద్దులో చైనాతో ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు అదే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించింది. అలాగే ప్రజలు సైతం చైనా ఉత్పత్తుల్ని బహష్కరించడానికి ఇదే సరైన సమయమని ఎస్‌జేఎం కో-కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పిలుపునిచ్చారు. నటీనటులు, క్రికెటర్లు సహా ఇతర రంగాల్లోని ప్రముఖులు చైనా ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేయొద్దని కోరారు. 

సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సోమవారం 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా వైపూ 43 మంది మృతిచెందినట్లు సమాచారం. లద్దాఖ్‌లో గత ఆరు వారాలుగా ఇరు వర్గాల మధ్య వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల చర్చల అనంతరం బలగాల్ని ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణే తాజా ప్రాణనష్టానికి దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని