దిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా నెగటివ్

దిల్లీ ఆరోగ్యమంత్రి సంత్యేంద్ర జైన్‌ కరోనా బారి నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో....

Published : 26 Jun 2020 18:46 IST

దిల్లీ: దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ కరోనా బారి నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒక దశలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందజేశారు. దీంతో ఆయనలో వైరస్‌ లక్షణాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు. ‘‘ఈ రోజు నిర్వహించిన కరోనా పరీక్ష ఫలితాల్లో నెగటివ్‌ వచ్చింది’’ అని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

మరోవైపు దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు దిల్లీలో 73,780 కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే 2429 మంది వైరస్‌ కారణంగా మృతిచెందారు. కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. మహమ్మారిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పల్స్‌ ఆక్సీమీటర్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. అలానే కేంద్ర హోంశాఖ నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలను పాటించాలని దిల్లీ చీఫ్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని